Vijay Deverakonda: మాల్దీవులకు పయనమైన విజయ్‌, రష్మిక.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

|

Oct 07, 2022 | 2:53 PM

'గీతగోవిందం' సినిమాతో బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక జంట. ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌తో మరోసారి ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేశారీ లవ్లీ పెయిర్‌. ఇలా వీరిద్దరూ రెండు సినిమాల్లో నటించారో లేదో అలా పుకార్లు షికార్లు చేశాయి...

Vijay Deverakonda: మాల్దీవులకు పయనమైన విజయ్‌, రష్మిక.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Vijay Devarakona, Rashmika
Follow us on

‘గీతగోవిందం’ సినిమాతో బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక జంట. ఆ తర్వాత డియర్‌ కామ్రేడ్‌తో మరోసారి ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేశారీ లవ్లీ పెయిర్‌. ఇలా వీరిద్దరూ రెండు సినిమాల్లో నటించారో లేదో అలా పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే విజయ్‌ దేవరకొండ కొత్తింటిలో జరిగిన వేడుకకు రష్మిక హాజరుకావడంతో మరోసారి ఈ జంట గురించి వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే దీనిపై ఇటు విజయ్‌ కానీ, అటు రష్మిక కానీ అధికారికంగా స్పందించలేరు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఈ జంట టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. దీనికి కారణం వీరిద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించడమే. రష్మిక ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న కాసేపటికే విజయ్‌ దేవరకొండ కూడా వచ్చాడు. ఇంకేముంది మళ్లీ పుకార్లకు ఊతమిచ్చినట్లైంది. వీరిద్దరూ మాల్దీవులకు వెళుతున్నారని, అందులో భాగంగానే ముంబై నుంచి విమానంలో బయలుదేరారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. విజయ్‌, రష్మిక ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ జంట నిజంగానే ప్రేమలో ఉందన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కి జోడిగా సమంత నటిస్తోంది. ఇక రష్మిక విషయానికొస్తే పుష్ప సినిమాతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అమితాబ్‌ కీలకపాత్రలో నటించిన గుడ్‌బై చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..