‘నగ్నత్వం’ నేరమైతే.. నాగ బాబాలను అరెస్ట్ చేయండి: పూజా సంచలన వ్యాఖ్యలు
బీచ్‌లో నగ్నంగా ఫొటో తీసుకున్న బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్‌పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతును
Milind Soman Nude Photo: బీచ్‌లో నగ్నంగా ఫొటో తీసుకున్న బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్‌పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతును ఇస్తూ నటి పూజా బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగ్నత్వం నేరమైతే, ముందు నాగ బాబాలను అరెస్ట్ చేయండి అని ఆమె అన్నారు. (ఏపీ మంత్రులు మేకపాటి, అనిల్ కుమార్‌లకు తప్పిన పెను ప్రమాదం)
దీనిపై ఓ పోస్ట్ చేసిన పూజా బేడీ.. మిలింద్ సోమన్ అందమైన ఫొటోలో ఎలాంటి అసభ్యత లేదు. అసభ్యత అన్నది చూసే వాడి దృష్టిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నగ్నత్వం అన్నది నేరమైతే నాగబాబాలు అందరినీ అరెస్ట్ చేయాల్సిందే. ఒంటికి బూడిద రాసుకుంటే వారిని ఒప్పుకుంటారా..! అని కామెంట్ పెట్టారు. (కమెడియన్ పుట్టినరోజు నాడే కుమారుడు మృతి.. భావోద్వేగ పోస్ట్)
కాగా ఇటీవల తన 55వ పుట్టినరోజు సందర్భంగా గోవాలోని ఓ బీచ్‌లో నగ్నంగా పరిగెత్తుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు. దాన్ని అతడి భార్య అంకిత కోన్వర్ తీశారు. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కూడా వచ్చింది. అయితే నటి పూనమ్ పాండేపై గోవాలోని పవిత్ర డ్యామ్ వద్ద ఇటీవల ఓ అసభ్యకర వీడియోను తీశారు. దాంతో ఆమెపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మిలింద్‌పై విమర్శలు రాగా.. అతడిపై కూడా పలు సెక్షన్ల కింత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (గంజాయ్ స్మగ్లర్ చేతిలో దారుణ హత్యకు గురైన టీవీ రిపోర్టర్)
A bsolutely nothing obscene about @milindrunning aesthetic pic. The obscenity lies in the minds of a viewer imagining more!His crime is being good looking,famous & setting bench marks!If nudity is a crime all naga babas should be arrested. Smearing ash can't make it acceptable! pic.twitter.com/vTTAK8whIi
— Pooja Bedi (@poojabeditweets) November 8, 2020