Pushpa: పుష్ప యూనిట్‌కు కీలక సూచనలు చేసిన అల్లు అర్జున్‌.. ఆ తప్పు మళ్లీ చేయొద్దంటూ..

|

Feb 19, 2022 | 4:55 PM

Pushpa: బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి అంతలా దేశవ్యాప్తంగా చాటిచెప్పిన సినిమా పుష్ప. ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి..

Pushpa: పుష్ప యూనిట్‌కు కీలక సూచనలు చేసిన అల్లు అర్జున్‌.. ఆ తప్పు మళ్లీ చేయొద్దంటూ..
Allu Arjun
Follow us on

Pushpa: బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి అంతలా దేశవ్యాప్తంగా చాటిచెప్పిన సినిమా పుష్ప. ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ చిత్రీకరణను వేగంగా పరుగులు పెట్టిస్తోంది. అయితే ఈ సమయంలోనే అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌కు కొన్ని కీలక సూచనలు చేశారంటా. పుష్ప తొలి పార్ట్‌ షూటింగ్‌ అనుకున్న సమయానికి పూర్తి కాలేదనే విషయం తెలిసిందే. చిత్రీకరణ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్‌ చేయలేకపోయింది. పని ఒత్తిడి కారణంతో ప్రిరీలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్‌ కూడా హాజరు కాలేని పరిస్థితి వచ్చింది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌కు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. పుష్ప రైజ్‌ సమయంలో జరిగిన తప్పును, పుష్ప ది రూల్‌లో జరగకుండా చూడాలని బన్నీ చిత్ర యూనిట్‌ను కోరినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, ప్రమోషన్స్‌కు ఎక్కువ సమయం కేటాయించేలా చూడాలని బన్నీ సూచించారట. దీంతో బన్నీ సూచనలను సీరియస్‌గా తీసుకున్న మూవీ టీం చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం.

అయితే బన్నీ చెప్పిన పాయింట్‌లోనూ లాజిక్‌ ఉంది. ఎందుకంటే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా ముంబయి నుంచి బెంగళూరు వరకు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లను నిర్వహించాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది కదూ.!

Also Read: Andhra Pradesh: ఊరంతా నిర్మానుష్యం.. పశువులతో సహా మాయం.. అసలు ఏమిటీ చిత్రం..?

Hyderabad DCCB Recruitment 2022: హైదరాబాద్‌ డీసీసీబీలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ. 57 వేల జీతం..

Chhatrapati Shivaji: సత్యం, న్యాయం విషయంలో ఎన్నడూ రాజీపడని ధీరుడు ఛత్రపతి శివాజీ: మోడీ