AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే హంగామా, లేజర్ లైట్ షో లైవ్..

Allu Arjun Birthday Celebrations Laser and Light Show live : తన స్టైలిష్ ఫెర్ఫార్మెన్స్ తో ఐకాన్ స్టార్ గా ఘనత కెక్కిన బన్నీ పుట్టినరోజు సందర్భంగా..

Allu Arjun Birthday Celebrations : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే హంగామా, లేజర్ లైట్ షో లైవ్..
Pushparaj
Venkata Narayana
|

Updated on: Apr 08, 2021 | 8:12 PM

Share

Allu Arjun Birthday Celebrations Laser and Light Show live : తన స్టైలిష్ ఫెర్ఫార్మెన్స్ తో ఐకాన్ స్టార్ గా ఘనత కెక్కిన బన్నీ పుట్టినరోజు సందర్భంగా సౌతిండియా వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా సిటీలో లేజర్‌, లైట్‌ షో హైదరాబాదీలను ఉర్రూతలూగిస్తోంది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద జరుగుతోన్న ఈషో బన్నీ ఫ్యాన్స్ ను సంబరాల్లో ముంచెత్తుతోంది. రాత్రి 7 గంటలకు మొదలైన పుష్ప లేజర్‌, లైట్‌ షో కు భారీగా బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఓ హీరో బర్త్‌ డే కోసం లేజర్‌ షోని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌.

Allu Arjun Pushpa

Allu Arjun Pushpa

ఇప్పటికే ఐకాన్‌ స్టార్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప టీజర్‌, కొంచెం సేపటి క్రితం రిలీజ్ చేసిన తాజా పోస్టర్ లక్షల్లో వ్యూస్‌ ని అందుకుంటూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అర్థరాత్రి అల్లు అభిమానులు హీరో ఇంటిముందు టపాసులు పేల్చి బర్త్‌ డేని గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది లాక్‌ డౌన్‌ కారణంగా అల్లు అర్జున్‌ బర్త్‌ డేని జరుపుకోలేకపోయిన ఫ్యాన్స్‌ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో హంగామా చేస్తున్నారు. హీరో పిలుపు మేరకు సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూనే, ఇప్పుడు ధూమ్‌ ధామ్‌ లేజర్ లైవ్ షో లో సందడి చేస్తున్నారు. ఆ పండుగ వాతావరణాన్ని మీకోసం ప్రత్యక్ష ప్రసారం..