AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBomma Ravi : నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి.. ఖర్చులు భరించలేకపోతున్నానని పిటిషన్..

కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాతోపాటు, సినీ పరిశ్రమలో మారుమోగిన పేరు ఐ బొమ్మ రవి. చాలా కాలంగా సైలెంట్ అయిన అతడు.. ఇప్పుడు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

iBomma Ravi : నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి.. ఖర్చులు భరించలేకపోతున్నానని పిటిషన్..
Ibomma Ravi
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2026 | 1:45 PM

Share

ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. తన కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో తన ఖాతాలో రూ.3 కోట్లు అలాగే ఉండిపోయాయని.. తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తనకు తిరిగి ఇప్పించాలని తన పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

ఐబొమ్మ రవి విషయానికి వస్తే.. ఇమంది రవి.. విశాఖపట్నంకు చెందిన కుర్రాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి అనంతరం పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలంగా విదేశాల్లో ఉన్న రవి… ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో మనస్పర్థలు, విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

సినిమా పైరసీ, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తులోకి వచ్చాయి. ఐబొమ్మ వెబ్‌సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రవిపై పలు సెక్షన్స్ పేరిటా కేసులు నమోదు అయ్యాయి. అయితే దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 18ను చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు రవి. చాలా రోజులుగా జైలులో ఉన్న రవి ఇప్పుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో అతడి పేరు తెరపైకి వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us