AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Tokku Pachadi: నెలరోజులు నిల్వ ఉండే ముద్ద ముద్దకి ముక్క తగిలే చికెన్ తొక్కు పచ్చడి!

ఇంటిల్లిపాదికీ రోజూ ఉదయాన్నే లంచ్ బాక్స్ సిద్ధం చేయడం గృహిణులకు పెద్ద సవాలు. ముఖ్యంగా ఒంట్లో నలతగా ఉన్నప్పుడో లేదా విపరీతమైన నీరసంగా ఉన్నప్పుడో వేడివేడిగా రకరకాల కూరలు చేయడం చాలా కష్టమవుతుంది. అటువంటప్పుడు ఒక్కసారి చేసుకొని నిల్వ పెట్టుకుంటే నెల రోజుల పాటు లంచ్ బాక్స్‌లకు ఆపద్బాంధవుడిలా పనికొచ్చే రెసిపీ 'చికెన్ తొక్కు పచ్చడి'.

Phani CH
|

Updated on: Sep 16, 2026 | 12:47 PM

Share
సాధారణంగా చికెన్ పచ్చడి అంటే చాలామంది బ్రెస్ట్ పీసెస్ వాడుతుంటారు; కానీ అవి కొద్దిరోజులకు పీచులా, గట్టిగా మారిపోతాయి. అలా కాకుండా లెగ్ పార్ట్ పీసెస్‌తో బోన్‌లెస్ కీమాలా చేసుకుంటే ముద్ద ముద్దకీ ముక్క తగులుతూ, లోపల ఎంతో జ్యూసీగా ఉంటుంది.  ఈ స్పెషల్ చికెన్ తొక్కు తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 6
కావలసిన పదార్థాలు: 1 కిలో చికెన్, తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె ఉడికించడానికి, 300 నుండి 400 గ్రాములు వేరుశనగ నూనె పచ్చడి కోసం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, 50-70 గ్రాముల మంచి రంగు ఉండే పచ్చడి కారం, 2 పెద్ద రసం తీసిన నిమ్మకాయలు. స్పెషల్ మసాలా పొడి కోసం: అర టీస్పూన్ మెంతులు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 10 యాలకులు, చిన్న అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు.

2 / 6
తయారీ విధానం: చికెన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్ లేదా వెడల్పాటి గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, 1 స్పూన్ నూనె కలపాలి. నీళ్లు ఒక్క చుక్క కూడా పోయకూడదు; చికెన్‌లో ఊరిన సహజ నీరంతా ఆవిరైపోయే వరకు మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. చల్లారిన తర్వాత ఎముకలను వేరు చేయాలి దాదాపు ముప్పావు కిలో బోన్‌లెస్ చికెన్ వస్తుంది. ఈ ముక్కలను చాపర్‌లో లేదా చాకుతో కీమాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి.

3 / 6
పాన్‌లో మెంతులను దోరగా వేయించి, ఆపై ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసి లో ఫ్లేమ్‌లో వేపాలి. చివరగా ఆవాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 6
బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. అందులోనే చాప్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. ముక్క మరీ గట్టిపడకుండా లేత బంగారు రంగులోకి రాగానే.. తగినంత ఉప్పు, సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత పచ్చడి కారం వేసి వెంటనే స్టవ్ ఆపేయాలి.

5 / 6
పచ్చడి పూర్తిగా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత గింజలు తీసిన తాజా నిమ్మరసాన్ని పిండి బాగా కలపాలి. తడిలేని గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిస్తే బయట నెల రోజుల పాటు, ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. హాస్టల్ పిల్లలకు, వర్కింగ్ ఉమెన్స్ లంచ్ బాక్సులకు ఈ చికెన్ తొక్కు దివ్యమైన వరం!

6 / 6
Follow Us