చెన్నై: చెన్నై చిన్నది శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ వార్తల్లో నిలిచింది. తమన్నా చాలా మంచి అమ్మాయని, తనను అంత తేలికగా వదులుకోనని శృతిహాసన్ అంటోంది. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. ప్రతి స్టేజ్‌పై ఒకరినొకరు ప్రశంసించుకునేవారు.
ఒక వేళ మీరు అబ్బాయి అయి ఉంటే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లేవారని ఓ కార్యక్రమంలో శృతిని ప్రశ్నిస్తే ఇంకెవరు? తమన్నా అంటూ బదులిచ్చింది. నేనే గనక అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను చెప్పింది శృతి హాసన్.