AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్… న్యూ స్టార్ట్… రెట్టించిన ఉత్సాహంతో 2021ని ప్రారంభిద్దాం… టాలీవుడ్ హీరో రామ్ పోతినేని…

కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో ఒంటరిగా గడిపాను. స్వయంగా వంట చేయడం, బుక్స్‌ చదవడం, పెంపుడు కుక్క(బార్డ్)ను వాకింగ్‌కు తీసుకెళ్లడం చేశానని టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అన్నారు.

న్యూ ఇయర్... న్యూ స్టార్ట్... రెట్టించిన ఉత్సాహంతో 2021ని ప్రారంభిద్దాం... టాలీవుడ్ హీరో రామ్ పోతినేని...
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Dec 19, 2020 | 3:19 PM

Share

‘‘కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో ఒంటరిగా గడిపాను. స్వయంగా వంట చేయడం, బుక్స్‌ చదవడం, పెంపుడు కుక్క(బార్డ్)ను వాకింగ్‌కు తీసుకెళ్లడం చేశాను. చాలా బోరింగ్‌గా అనిపించింది. అయితే, తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. 2021 ఏడాది కోసం ఆసక్తిగా ఉన్నాను. నా చిత్రం రెడ్‌ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇది కొత్త ఏడాదిని ప్రారంభించేదుకు సరైన మార్గం. 2020 మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవడాని ఒక అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. న్యూ ఇయర్‌ను న్యూగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా’’… అని టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అన్నారు.

కరోనా కారణంగా జరిగిన మంచి పని ఏంటంటే…

కరోనా కారణంగా ఏదైనా మంచి పని జరిగింది అంటే అది వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానం పెరగడమని రామ్ అన్నారు. ఉద్యోగాలు చేయడం అవసరమని, కానీ అదే సమయంలో మనం ఇంకా మహమ్మారి ముప్పులో ఉన్నామని గుర్తించాలని అన్నారు. ఇప్పటికీ కరోనాకు వ్యాక్సిన్‌​అందుబాటులోకి రాలేదని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే… బయటకు వెళ్లే పనులను తగ్గించుకోవాలని సూచించారు. తాను ఇంటి నుంచే వర్చువల్‌గా స్టోరీ స్క్రీప్ట్స్‌ వింటూ, ఫోటో షూట్‌లతో బిజీగా ఉంటున్నట్లు తెలిపారు.

చాలా భయం వేసింది…

వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించేందుకు ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఫోటోషుట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశానని, ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం తేలికైన విషయం కాదు. నాకు కొంచెం విసుగొచ్చిందని అన్నారు. అంతేగాక నా కుటంబం కరోనా బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ, సోదరుడు(కృష్ణ చైతన్య)కి కరోనా సోకిందని తెలిపారు. ఆ సమయంలో చాలా భయం వేసిందని అన్నారు. ముఖ్యంగా నా సోదరుడికి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దేవుని దయతో పూర్తిగా కోలుకున్నాడని అన్నారు. ఇలా రామ్ తన జీవితంలో కరోనా కారణంగా సంభవించిన పలు ఘటనలను మీడియా తో పంచుకున్నారు.