తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు శుభవార్త.. కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు వీపీఎఫ్ చార్జీలు రద్దు.
కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన చిత్ర పరిశ్రమ, థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇదే క్రమంలో తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల (మల్టీప్లెక్స్‌లు కాకుండా)కు శుభవార్త తెలిపింది.

Telugu film producers council good news to theaters: కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన చిత్ర పరిశ్రమ, థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నెలల మారిటోరియంతో కూడిన రుణాలతో పాటు పలు వరాల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల (మల్టీప్లెక్స్‌లు కాకుండా)కు శుభవార్త తెలిపింది. డిసెంబర్ 2020లో విడుదలయ్యే సినిమాలకు పీవీఎఫ్ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లో విడుదలయ్యే సినిమాల డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లించనున్నట్లు ప్రకటించారు. డిజిటల్ సర్వీస్ ఛార్జీల సన్‌సెట్ క్లాజ్ నిబంధనపై మార్చి 31లోగా ఒప్పందం జరిగే అవకాశమున్నట్లు సమాచారం. అంతేకాకుండా డిజిటల్ సర్వీస్ ఛార్జీలపై ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా అధ్యయనం చేసి మంచి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలుగు సినిమా తిరిగి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభించేందుకు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు సహకరిస్తారని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.




