AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకాశ మార్గాన వస్తుంది.. అందినకాడికీ దోచేస్తుంది.. అర్కెస్ట్ర సింగర్ అసలు భాగోతం బయటపడింది..

విమానంలో వస్తుంది. అందంగా ముస్తాబవుతుంది. అందినకాడికి దోచేస్తుంది. మెట్రో నగరాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళ దోంగను ముంబై పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

అకాశ మార్గాన వస్తుంది.. అందినకాడికీ దోచేస్తుంది.. అర్కెస్ట్ర సింగర్ అసలు భాగోతం బయటపడింది..
Balaraju Goud
|

Updated on: Dec 19, 2020 | 3:11 PM

Share

విమానంలో వస్తుంది. అందంగా ముస్తాబవుతుంది. అందినకాడికి దోచేస్తుంది. మెట్రో నగరాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళ దోంగను ముంబై పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన ఆర్కెస్ట్రా సింగర్‌ తన ప్రవృత్తిని బయటపట్టింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రముఖ షాపింగ్‌ మాళ్లను, బ్యూటీపార్లర్లనే లక్ష్యంగా చేసుకొని వినియోగదారుల బ్యాగ్‌లు అపహరించడంలో సిద్ధహస్తురాలు. చోరీలు చేసేందుకు విమానాల్లో మాత్రమే ప్రయాణించడం ఆమె ప్రత్యేకత. పదేళ్లుగా ఆ సింగర్‌ కొనసాగిస్తున్న దొంగతనాల గుట్టురట్టు చేశారు ముంబయి పోలీసులు. ముంబయితో పాటు కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ చోరీలకు పాల్పడినట్లు ఆమె విచారణలో అంగీకరించింది.

బెంగళూరు నగరానికి చెందిన అర్చన(46) మారు పేర్లతో వివిధ నగరాల్లో అర్కెస్ట్రా సింగర్ గా రాణిస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో సెంట్రల్‌ ముంబయిలోని ప్రఖ్యాత మాల్‌లో జరిగిన చోరీపై అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులకు అర్చన భాగోతం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు దాదర్‌లో ఓ మాల్‌తోపాటు బ్యూటీపార్లర్‌లోనూ ఇదే తరహాలో చోరీలు జరగడంతో ఆ దిశగా దర్యాప్తు సాగించారు ముంబై పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌టవర్‌ లొకేషన్‌ల అధారంగా ఆమెను పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాన నగరాల్లో స్మార్ట్ గా జరుగుతున్న చోరీలు అర్చన నిర్వాకమేననే నిర్ధారణకు వచ్చారు.

రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లిన ముంబాయి పోలీసులు పక్కాగా స్కెచ్ వేసి ఆమెను అరెస్ట్‌ చేశారు. దీంతో ఆమెను అదుపులోకి విచారణ జరపడంతో అసలు నిజాలు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. 2009 నుంచి ఇలా చోరీలు చేస్తున్నట్లు ఆమె అంగీకరించింది. హైదరాబాద్‌లో ఆ సింగర్‌ చేసిన చోరీల గురించి తెలంగాణ పోలీసులకు ముంబయి పోలీసులు సమాచారం అందించారు. త్వరలోనే ఆమెను పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశముంది.