‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటోన్న మెగా మేనల్లుడు.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. డిసెంబర్ 25న విడుదల..

మెగా మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'...

'సోలో బ్రతుకే సో బెటర్' అంటోన్న మెగా మేనల్లుడు.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. డిసెంబర్ 25న విడుదల..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 19, 2020 | 2:58 PM

Solo Brathuke So Better Trailer: మెగా మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్‌విసీసీ బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘సోలో బ్రతుకే సో బెటర్’ అని అనుకునే ఓ యువకుడి పాత్రలో హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. ఆర్. నారాయణమూర్తిని ప్రేరణగా తీసుకుని సింగిల్‌గా ఉండాలని అనుకుంటాడు. ఇక హీరోకి, సీనియర్ నటుడు రావు రమేష్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్‌ను అందించే విధంగా ఉన్నాయి. అటు హీరోయిన్ నభా నటేష్‌కు కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కిందని చెప్పాలి. ఆద్యంతం ఆసక్తి రేపిస్తూ తెరకెక్కిన టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా, ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.