స్టార్ తనయుడిని కాకపోయినా.. బాలీవుడ్‌లో ఎలా నెట్టుకొస్తున్నానంటే..

ఫ్రెండ్‌షిప్‌ వలనే తాను బాలీవుడ్‌లో నెట్టుకొస్తున్నానని విద్యుత్ జమ్వాల్ అన్నారు. 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్‌లో మంచి స్నేహితులను చేసుకోవడం కష్టమని నాతో చాలా మంది అన్నారు.

స్టార్ తనయుడిని కాకపోయినా.. బాలీవుడ్‌లో ఎలా నెట్టుకొస్తున్నానంటే..

Edited By:

Updated on: Jul 24, 2020 | 4:47 PM

ఫ్రెండ్‌షిప్‌ వలనే తాను బాలీవుడ్‌లో నెట్టుకొస్తున్నానని విద్యుత్ జమ్వాల్ అన్నారు. ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్‌లో మంచి స్నేహితులను చేసుకోవడం కష్టమని నాతో చాలా మంది అన్నారు. కానీ నేను వాటిని నమ్మలేదు. నేను స్టార్‌ తనయుడిని కాదు. కానీ స్నేహం వలనే ఇక్కడ నెట్టుకొస్తున్నా. నేను నిన్ను నమ్ముతా. కానీ నా దగ్గర బడ్జెట్ లేదు అని ఓ ఫ్రెండ్ నాతో అన్నాడు. నిజంగా వారు నా వైపు ఉన్నారు. అలాగే నేను వారివైపు ఉన్నా. అలా అని వారందరూ నాకు మంచి స్నేహితులని చెప్పలేను” అని విద్యుత్ చెప్పుకొచ్చారు.

తనకు బాలీవుడ్‌లో అజయ్‌, అమిత్‌ సాధ్‌, కెన్నీ మంచి స్నేహితులని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా విద్యుత్‌ జమ్వాల్ నటించిన యారా ఈ నెల 30న జీ5లో విడుదల కాబోతుండగా.. ఖుదా హఫీజ్‌ త్వరలో హాట్‌స్టార్‌లో రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం ఈ మూవీల ప్రమోషన్‌లలో విద్యుత్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలోనూ విద్యుత్ నటించే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.