సినీనటి కీలక డేటా చోరీ.. పీఎస్‌లో ఫిర్యాదు..

ప్రముఖ సినీ నటి రాధాప్రశాంతి ఫోన్ నుంచి కీలక సమాచారం దొంగిలించారని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ డిజైనర్ లక్ష్మీ తనకు జీఎస్టీ కార్డు ఇప్పిస్తానని చెప్పి.. తన బ్యాంకు వివరాలు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రూ.25 వేల నగదు కూడా తీసుకున్నారని.. కానీ.. ఇప్పటివరకూ జీఎస్టీ కార్డు ఇప్పించలేదని పోలీసుల వద్ద వాపోయారు. డేటా చోరీ తర్వాత తన నుంచి తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. చీరల డిజైన్లు చూపించడానికి ఇటీవల లక్ష్మీ, చక్రి ఇద్దరు […]

సినీనటి కీలక డేటా చోరీ.. పీఎస్‌లో ఫిర్యాదు..

Edited By:

Updated on: Jul 18, 2019 | 11:55 AM

ప్రముఖ సినీ నటి రాధాప్రశాంతి ఫోన్ నుంచి కీలక సమాచారం దొంగిలించారని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ డిజైనర్ లక్ష్మీ తనకు జీఎస్టీ కార్డు ఇప్పిస్తానని చెప్పి.. తన బ్యాంకు వివరాలు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రూ.25 వేల నగదు కూడా తీసుకున్నారని.. కానీ.. ఇప్పటివరకూ జీఎస్టీ కార్డు ఇప్పించలేదని పోలీసుల వద్ద వాపోయారు. డేటా చోరీ తర్వాత తన నుంచి తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు.

చీరల డిజైన్లు చూపించడానికి ఇటీవల లక్ష్మీ, చక్రి ఇద్దరు తమ ఇంటికి వచ్చారని.. చక్రి ఫోన్ పనిచేయకపోవడంతో.. తన ఫోన్ ఇచ్చానని.. ఇచ్చిన తరువాత గమనిస్తే తన ఫోన్‌లో పర్సనల్ ఫోటోలు కూడా కనిపించలేదని చెప్పారు. అనంతరం లక్ష్మీ, చక్రీలకు ఫోన్ చేసినా స్పందించలేదని.. అందుకే పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.