The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ది మ్యాట్రిక్స్‌కు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. 1999లో ది మ్యాట్రిక్స్‌ విడుదల కాగా..

The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Matrix Resurrections
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Apr 26, 2022 | 12:25 PM

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ది మ్యాట్రిక్స్‌కు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. 1999లో ది మ్యాట్రిక్స్‌ విడుదల కాగా దీనికి కొనసాగింపుగా వచ్చిన ది మ్యాట్రిక్స్‌: రీలోడెడ్‌ (2003), ది మ్యాట్రిక్స్‌: రివల్యూషన్స్‌'(2003) చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ స్కైఫై యాక్షన్‌ సిరీస్‌లో వచ్చిన నాలుగో చిత్రం ది మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ (The Matrix Resurrections). ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కాగా గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్‌.

తెలుగులో కూడా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 6 నుంచి ఈ సినిమా ఇండియాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ యాక్షన్‌ మూవీ ప్రసారం అవ్వనుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్‌ కీను రీవ్స్‌, క్యారీ-అన్నే, జడా పింకెట్‌ స్మిత్‌, యహ్యా అబ్దుల్‌ మాటీన్‌, జోనాథన్‌ గ్రోఫ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also read: 

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..

Avika Gor: ఎర్రటి గులాబీ అందాలతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న అవికా.. ఇంత అందానికి ఫిదా కాని వారుంటారా

Health Tips: ఈ బ్లడ్ గ్రూపుల వారికే గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ.. కారణం ఏంటో తెలుసా?