Oscars 2025: లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు.. అస్కార్ అవార్డుల వేడుక జరుగుతుందా? ఫుల్ క్లారిటీ వచ్చేసింది

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ను అగ్ని కీలలు చుట్టుముట్టాయి. దీని ప్రభావం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులపై ప్రభావం చూపుతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఆస్కార్‌ నిర్వాహకులు స్పందించారు. అవార్డుల వేడుకకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.

Oscars 2025: లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు.. అస్కార్ అవార్డుల వేడుక జరుగుతుందా? ఫుల్ క్లారిటీ వచ్చేసింది
Oscar Awards 2025

Updated on: Jan 17, 2025 | 8:50 AM

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ తదితర ప్రాంతాల్లో తీవ్రమైన అడవి మంటలు వ్యాపించాయి. ఇందకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి అగ్నిప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మం ర‌ద్దు అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై క్లారిటీ వచ్చింది. నిర్ణీత తేదీన ఆస్కార్ అవార్డుల వేడుకలను నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. గత 96 సంవత్సరాలుగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ ప్రతిష్టాత్మక అవార్డు ఫంక్షన్లలో ఇదొకటి అని చాలా మందికి తెలుసు. ఇప్పుడు 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. అయితే అనూహ్యంగా అడవిలో మంటలు చెలరేగడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ’96 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని రద్దు చేయడం ఇదే తొలిసారి’ అంటూ పుకార్లు వినిపించాయి. అయితే ఆస్కార్ నిర్వాహకులు ఈ రూమర్లను ఖండించారు.

‘ ఆస్కార్ అవార్డుల వేడుకతో ఏటా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. కోవిడ్ విషయంలో కూడా ఇది ఆగలేదు. ఈసారి కూడా అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. కాగా మార్చి 2న ‘ఆస్కార్ అవార్డు’ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన సినిమాలు ఈసారి రేసులో ఉన్నాయి. ఇలా చాలా విభాగాల్లో అవార్డులు ఇస్తారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వంటి విభాగాల్లో సినిమాలు ఎంపిక కానున్నాయి. కాగా అమెరికా అడవుల్లో చెలరేగిన మంటలు చాలా నష్టాన్ని కలిగించాయి. అయితే ‘హాలీవుడ్’ స్టూడియోలో కూడా మంటలు చెలరేగాయని, దాని లోగో కాలిపోయిందని AI వీడియోలు రూపొందించి ప్రచారం చేశారు. అయితే అది నిజం కాదని ఇప్పుడు తెలిసింది. కాగా భారత్ నుంచి ‘లపాటా లేడీస్’ని ‘ఆస్కార్ అవార్డు’కి పంపారు. అయితే సినిమా ఎంపిక కాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.