ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో ముందు వరసలో ఉన్న సినిమా అవతార్ . జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ సినిమా.ఈ సినిమాతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు దర్శకుడు. 2009లో విడుదలైన ‘అవతార్‘ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్. 234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ రానుంది.
ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన గ్లిమ్స్ ను , పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో మూవీ పై అంచనాలను ఆకాశానికి చేర్చారు దర్శకుడు జేమ్స్ కామెరాన్ . అవతార్ 2లోకథ అండర్ వాటర్ నేపథ్యంలో సాగనుంది. మరోసారి మనుషులకు గ్రహాంతరవాసులు మధ్య జరిగే వార్ ను చూపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతోంది.
ఈ సినిమాను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్-2’ రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
On December 16, return to Pandora.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/UtxAbycCIc
— Avatar (@officialavatar) November 2, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..