Cannes 2022: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో మెరిసిన ఇండియన్ సెలబ్రెటీస్.. రెడ్ కార్పెట్ పై దీపికా నుంచి మాధవన్ వరకు

|

May 18, 2022 | 9:31 AM

ఈ వేడుకలు ప్రారంభోత్సవానికి మన భారతీయ నటీనటులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు.. అందులో పూజా హెగ్డే, ఏఆర్ రెహమాన్, తమన్నా, మాధవన్,

Cannes 2022: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో మెరిసిన ఇండియన్ సెలబ్రెటీస్.. రెడ్ కార్పెట్ పై దీపికా నుంచి మాధవన్ వరకు
Cannes 2022
Follow us on

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. పలైస్ డెస్ ఫెస్టివల్స్ లో రెడ్ కార్పెట్ పై స్టార్ స్టడెడ్ ఇండియన్ డెలిగేషన్ కు ఇన్పర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ నాయకత్వం వహించారు. ఈ వేడుకలు ప్రారంభోత్సవానికి మన భారతీయ నటీనటులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు.. అందులో పూజా హెగ్డే, ఏఆర్ రెహమాన్, తమన్నా, మాధవన్, నవాజుద్దీన్, దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య తదితరులు ఈ వేడుకలో పాల్గోన్నారు.

అంతకు ముందు జ్యూరీ మెంబర్‏గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ ప్రారంభోత్సవానిక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అలాగే.. ఇండియన్ పెవిలియన్ నుంచి ఏఆర్ రెహమాన్, తమన్నా, పూజా హెగ్డే, మాధవన్ తదితరులు హజరవుతున్నారు. ఈ నెల 28 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అంతేకాకుండా… ఇందులో మాధవన్ నటించిన రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ వరల్డ్ ప్రీమియర్ కానుంది. ఇక జ్యూరీ సభ్యులుగా దీపికా కంటే ముందు నందితా దాస్, విద్యాబాలన్, షర్మిలా ఠాగోర్, ఐశ్వర్య ఈ గౌరవాన్ని పొందారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 75వ ఎడిషన్ లో మార్క్యూ ఈవెంట్ వ్యాపార ప్రతిరూపమైన మార్చేడు ఫిల్మ్ లో భారతదేశానికి కంట్రీ ఆఫ్ హానర్ అని పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

Canes 2022