BTS-K Pop: బీటీఎస్ కొత్త ఆల్బమ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సాంగ్స్..10 గంటల్లోనే 20 లక్షల కాపీలు అమ్మకం

| Edited By: Ravi Kiran

Jun 13, 2022 | 8:32 PM

K-pop అభిమానులను BTS కొత్త ఆల్బమ్ ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్ ప్రూఫ్ విడుదలైనప్పటి నుంచి 20 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. BTS ఈ ఆల్బమ్ శుక్రవారం మార్కెట్లో విడుదలైంది.

BTS-K Pop: బీటీఎస్ కొత్త ఆల్బమ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సాంగ్స్..10 గంటల్లోనే 20 లక్షల కాపీలు అమ్మకం
Bts 9 Th Anniversary
Follow us on

BTS 9th Anniversary: కొరియన్ డ్రామాలు, కొరియన్ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. కే పాప్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యాండ్స్ అనేకం ఉన్నాయి. అయితే వీటిల్లో 9 ఏళ్ళక్రితం తన జర్నీని మొదలు పెట్టిన BTS కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బీటిఎస్‌(BTS) ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన అతిపెద్ద మ్యూజిక్‌ బ్యాండ్‌. BTS (“బియాండ్ ది సీన్” కోసం) అని పిలువబడే బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటిఎస్‌  తన “బీటిఎస్‌ ఆర్మీ ” కోసం 9వ వార్షికోత్సవ వేడుకలకు ముందు ఒక ఆల్బమ్‌ను విడుదల చేసింది.

K-pop అభిమానులను BTS కొత్త ఆల్బమ్ ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్ ప్రూఫ్ విడుదలైనప్పటి నుంచి 20 లక్షల కాపీలు  అమ్ముడయ్యాయి. BTS  ఈ ఆల్బమ్ శుక్రవారం మార్కెట్లో విడుదలైంది. విడుదలైన 10 గంటల్లోనే 20 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.

ఇప్పటికే రికార్డు సృష్టించింది
2020లో  BTS తన నాల్గవ ఆల్బమ్ Map of the Soul: 7తో కూడా ఇదే రికార్డును సృష్టించింది, 2020 తర్వాత ఈ బాయ్ బ్యాండ్ ఆల్బమ్ మొదటి రోజు రెండు మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడవడం ఇది రెండోసారి. దీని టైటిల్ సాంగ్ యెట్ టు కమ్ (ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్). యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ మ్యూజిక్ వీడియోకి దాదాపు 50 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

BTS అంటే బాంగ్టన్ సోనియోండన్ ..  బియాండ్ ది సీన్. అయితే అభిమానులకు ఈ కొరియన్ బ్యాండ్ BTS గానే తెలుసు. ఈ బృందంలో 7 మంది ఉన్నారు. ఈ బ్యాండ్‌ను దక్షిణ కొరియాలో నివసిస్తున్న 7 మంది సంగీతకారులు ఏర్పాటు చేశారు. BTS తన మొదటి పాటను  9 సంవత్సరాల క్రితం అంటే 12 జూన్ 2013న విడుదల చేసింది. ఇప్పుడు ఈ బ్యాండ్ తన 9వ వార్షికోత్సవం జరుపుకుంటుంది.  మొదటి ఆల్బమ్ చాలా సూపర్ హిట్ అయింది.. అంతేకాదు ఈ బ్యాండ్ అనేక అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్లలో నామినేట్ చేయబడింది.

అనేక అవార్డులను గెలుచుకున్న BTS 
ఇప్పటివరకు BTS అనేక అవార్డులను గెలుచుకుంది. మలోన్ మ్యూజిక్ అవార్డ్ , గోల్డెన్ డిస్క్ అవార్డ్‌తో పాటు, BTS వారి తొలి ఆల్బమ్‌కు 2014 సోల్ మ్యూజిక్ అవార్డును కూడా అందుకుంది. 2016 సంవత్సరంలో మళ్ళీ ఉత్తమ సంగీత ఆల్బమ్ విభాగంలో మలోన్ మ్యూజిక్ అవార్డును గెలుచుకున్నారు. ఇది మాత్రమే కాదు, BTS యొక్క 2 మ్యూజిక్ ఆల్బమ్‌లు US బిల్‌బోర్డ్ 200లో కూడా చోటు సంపాదించాయి. వారి రెండవ పూర్తి ఆల్బమ్, వింగ్స్ (2016), బిల్‌బోర్డ్ 200లో 26వ స్థానానికి చేరుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..