Avatar 2 teaser: అవతార్ 2 టీజర్ వచ్చేసింది.. సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టుగా..

|

May 10, 2022 | 8:56 AM

గతంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అవతార్ చిత్రానికి సిక్వెల్‏గా అవతార్ 2.. ది వే ఆఫ్ వాటర్.. మూవీని రూపొందిస్తున్నారు డైరక్టర్ జేమ్స్

Avatar 2 teaser: అవతార్ 2 టీజర్ వచ్చేసింది.. సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టుగా..
Avatar 2
Follow us on

మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2 (Avatar 2). ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అవతార్ చిత్రానికి సిక్వెల్‏గా అవతార్ 2.. ది వే ఆఫ్ వాటర్.. మూవీని రూపొందిస్తున్నారు డైరక్టర్ జేమ్స్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‏ను హాలీవుడ్ మూవీ డైరెక్టర్ స్ట్రేంజ్ మ్యా్డ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్లో ప్రదర్శించారు. తాజాగా ఈ మూవీ టీజర్‏ను మే 9 న విడుదల చేశారు.

ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్ తో ప్రారంభంకాగా .. సముద్ర ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. అందులో అద్భుతమైన లోకేషన్లు, నీలి సముద్రం అందంగా కనిపిస్తోంది. అద్భుతమైన గ్రాఫిక్ మాయజాలం అడుగుడుగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‏ అవతార్ 2 సినిమాపై అంచనాలను భారీగానే పెంచేసింది. టీజర్‏తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ‘అవతార్ ది వే ఆఫ్ ది వాటర్’ మొదటి పార్ట్ కు మించి ఉంటుందని చిత్రబృందం అంటుంది. గతంలో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన అవతార్ సినిమాకు సిక్వెల్ గా వస్తున్న అవతార్ 2 మూవీ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట