Priyanka Chopra: తన అందం, అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక ఇండియాతోపాటు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వా ప్రియాంక ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు షూటింగ్ స్పాట్‌లో గాయపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
లండన్‌లో జరుగుతోన్న ‘సిటాడెల్’ ఎపిసోడ్ చిత్రీకరణలో ప్రియాంక పాల్గొంది. ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతూ కామెంట్లు చేశారు.
అయితే ఆ రక్తమంతా మేకప్‌లోనే భాగమని తెలిపిన ప్రియాంక.. ఈ ఫొటోలో రియల్ గాయం ఏది.? కానిది ఏది అంటూ పోస్ట్ చేసింది. ఇక అనంతరం.. మేకప్‌లో భాగంగా మేకప్ చేసిన గాయంతో పాటు, నిజంగా అయిన గాయాన్ని వివరిస్తూ ఫొటోను పోస్ట్ చేసింది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక కనుబొమ్మపై చిన్న గాటు పడింది. దీంతో ఆమె ఫ్యాన్స్ గాయం ఎలా అయ్యింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Childhood Photo: సహజనటి పక్కన ఉన్న ఈ బాలుడు.. నేడు యువతకు కలల రాకుమారుడు ఎవరో గుర్తు పట్టారా..
Viral Video: ఇదేం జంప్ బాబు.. నడుం విరిగిందనుకో..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..