Money Heist Part 5: రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ రిలీజ్ కానున్న మోస్ట్ అవెయిటెడ్ మనీహీస్ట్ సిరీస్
కరోనా సిచ్యుయేషన్‌కి ముందు... డిజిటల్ కంటెంట్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే.. రీజినల్ సినిమాలు డిజిటల్‌లో రిలీజ్ అయినా... వాటి నంబర్ చాలా నామినల్.
Money Heist: Part 5: కరోనా సిచ్యుయేషన్‌కి ముందు… డిజిటల్ కంటెంట్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే.. రీజినల్ సినిమాలు డిజిటల్‌లో రిలీజ్ అయినా… వాటి నంబర్ చాలా నామినల్. కానీ కోవిడ్ అంతా… మార్చేసింది. ప్రజెంట్ ఓటీటీలో రీజినల్ కంటెంట్ కూడా గట్టిగా సౌండ్ చేస్తోంది. ప్రజెంట్ ఇంటర్నేషనల్ మేకర్స్ కూడా ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్ మీద స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లీష్‌లో మాత్రమే రిలీజ్ అయిన కంటెంట్ ఇప్పుడూ.. ఇండియాలో అది కూడా హిందీతో పాటు అన్ని రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా మనీహీస్ట్ ట్రైలర్‌తో ఇండియాలో డిజిటల్ మార్కెట్ గురించి అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతోంది. మనీ హీస్ట్.. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ సిరీస్.. ఇప్పటికే నాలుగు సీజన్లు రిలీజ్ కాగా.. అన్ని సీజన్లకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అందుకే 5 సీజన్ మీద ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మోస్ట్ అవెయిటెడ్ మనీహీస్ట్ సీజన్‌ను ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ రిలీజ్ చేస్తోంది యూనిట్. హిందీ వర్షన్‌ను అనిల్ కపూర్ ప్రమోట్ చేస్తుండగా.. తెలుగు వర్షన్‌ను రానా దగ్గుబాటి ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌లో రానా సౌత్ నెటివిటీని రిఫ్లెక్ట్ చేసే గెటప్‌లో కనిపించారు. నేషనల్ లెవల్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్, సాక్రెడ్ గేమ్స్, మిర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద స్పెషల్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి. స్ట్రయిట్ వెబ్ సిరీస్‌ల విషయంలో సౌత్‌లో తెలుగు కంటెంట్‌దే పై చేయిగా కనిపిస్తోంది. లెవెన్త్ అవర్, మెయిల్ లాంటి వెబ్ సిరీస్‌లతో తెలుగు కంటెంట్ విషయంలో ఆహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..
Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..
Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..