AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం జంప్‌ బాబు.. నడుం విరిగిందనుకో..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారు.

Viral Video: ఇదేం జంప్‌ బాబు.. నడుం విరిగిందనుకో..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Viral Video
uppula Raju
|

Updated on: Aug 28, 2021 | 9:10 AM

Share

Viral Video: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తాడుతో చెరువులోకి దూకడానికి ప్రయత్నించి నడుం విరగొట్టుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

వీడియోలో మనం చూస్తే ఓ వ్యక్తి చెట్టుకు తాడుకట్టి దాని సహాయంతో చెరువులోకి దూకడానికి ప్రయత్నించడం మనం గమనించవచ్చు. కానీ సడెన్‌గా తాడు తెగిపోవడంతో చెరువులో ఉన్న దుంగలపై పడిపోతాడు. దీంతో అతడి వెన్నెముఖకు బలమైన దెబ్బ తగిలి ఉంటుందని మనం ఊహించవచ్చు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చాలామంది నెటిజన్లు వీడియో చూసి తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వినియోగదారు ఇలా అన్నాడు ‘జీవితాన్ని ఇలా ఎగతాళి చేయకూడదని చెప్పాడు’ మరొకరు అతడు మూర్ఖుడిలా ప్రవర్తించాడని రాశాడు. ఇది కాకుండా చాలామంది దీనిపై ఫన్నీ కామెంట్స్‌ చేశారు. కొంతమంది ప్రమాదకరమైన ఫీట్లు చేయడం మానుకోండని హితవు చెప్పారు. ఇలా ఈ వీడియోను ఇప్పటివరకు 50వేల మందికి పైగా చూశారు. చాలామంది లైకులు, కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ‘@HldMyBeer’ పేరుతో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు పదే పదే చూస్తే కామెంట్స్ చేస్తుంటారు. చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలనే ఉద్ధేశ్యంతో ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. కానీ శ్రుతి మించితే ఏదైనా అనార్థాలకు దారితీస్తుందనే విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు.

Glowing Skin: సహజమైన ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. నిగనిగలాడే ముఖ వర్చస్సు మీ సొంతం చేసుకోండి..

Viral Video: పుర్రెకో బుద్ధి అంటే ఇదేనేమో.. పామును హెయిర్‌ బ్యాండ్‌గా ధరించిన మహిళా. షాక్‌ అవుతోన్న నెటిజన్లు.

Andhra Pradesh: ఏపీలో క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి.. 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్