Kinnerasani Teaser: అద్భుతం జరిగే ప్రతీ చోటా ఆపదలు ఉంటాయి.. ఆకట్టుకుంటోన్న మెగా అల్లుడి ‘కిన్నెరసాని’ టీజర్.
Kinnerasani Teaser: 'విజేత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాలోనే ఎలాంటి ఆడంబరాలకు పోకుండా మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందకు వచ్చిన కల్యాణ్...
Kinnerasani Teaser: ‘విజేత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాలోనే ఎలాంటి ఆడంబరాలకు పోకుండా మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందకు వచ్చిన కల్యాణ్ నటుడిగా మంచి మార్కులే కొట్టేశారు. ఇక తర్వాత ‘సూపర్ మచ్చి’ అనే చిత్రంలో నటించిన కల్యాణ్.. తాజాగా ‘కిన్నెరసాని’ అని అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కల్యాణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ‘కిన్నెరసాని’ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. 1:30 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
అసలు సినిమా కథ ఏంటన్నదానిపై ఏ మాత్రం స్పష్టత ఇవ్వకుండా మూవీ మేకర్స్ సస్పెన్స్‌ను కొనసాగించారు. కల్యాణ్ మేకోవర్‌తో పాటు నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక టీజర్‌లో వచ్చే.. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి’, ‘ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా.. చివరకి ప్రేమకైనా’ అనే డైలాగ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాను ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాతో కల్యాణ్ కచ్చితంగా మరో మెట్టు పైకెక్కినట్లేనని టీజర్ చూస్తే కచ్చితంగా అర్థమవుతోంది.
Thalaivi Movie: జయలలిత, ఎమ్‌జీఆర్‌ల ప్రణయ గీతం… తలైవి మరో సాంగ్ టీజర్‌ను చూశారా.?