Priyanka Chopra: నేను ఎక్కడికి వెళ్లినా అవి నాతోనే ఉంటాయి.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు..

Priyanka Chopra: ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించిన ఈ అందాల తర్వాత బాలీవుడ్‌ అటు నుంచి ఏకంగా హాలీవుడ్‌కు తన..

Priyanka Chopra: నేను ఎక్కడికి వెళ్లినా అవి నాతోనే ఉంటాయి.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు..
Priyanka Chopra

Edited By:

Updated on: Dec 19, 2021 | 8:16 AM

Priyanka Chopra: ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించిన ఈ అందాల తర్వాత బాలీవుడ్‌ అటు నుంచి ఏకంగా హాలీవుడ్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రస్తుతం హాలీవుడ్‌ టాప్‌ మూవీస్‌లో నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది. రోజురోజుకీ క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటూ పోతున్న ఈ చిన్నది తాజాగా మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో హాలీవుడ్‌ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిందీ చిన్నది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియాంక.

నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక అమెరికాలోనే స్థిరపడిన విషయం తెలిసిందే. అడపాదడపా మాత్రమే ఇండియాకు వస్తూ పోతోంది. అయితే ఇదే విషయమై టెలివిజన్ హోస్ట్‌ రాషా గోయెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదు. అలాగే ‘మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడు భారత్‌కు దూరంగా ఉన్నట్లు అనుకోలేదు. అమ్మానాన్న, ఇళ్లు, నా దేవాలయం ఇలా అన్నీ ఎప్పుడూ నాతోనే ఉంటాయ’ని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్‌ పరిశ్రమలో సినిమాల గురించి మాట్లాడుతూ.. అటు హాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌ పరిశ్రమలను బ్యాలెన్స్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టిందీ బ్యూటీ.

Also Read: TTD: తిరుమలలో ఉదయాస్తమాన సేవా టికెట్లు.. ధర కోటిన్నర రూపాయలు

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Follow Us