AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?

ఇటీవల సైరాతో ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ మూవీలో నటిస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ నెల నుంచే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో చిరు సరసన నటించేందుకు పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా నయనతార, తమన్నా, […]

చిరుకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 05, 2019 | 2:56 PM

Share

ఇటీవల సైరాతో ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ మూవీలో నటిస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ నెల నుంచే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో చిరు సరసన నటించేందుకు పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా నయనతార, తమన్నా, అనుష్క, కాజల్, శ్రుతీ హాసన్.. ఇలా కొందరి పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష కన్ఫర్మ్ అయిందట.

దీనికి సంబంధించి త్రిషతో సంప్రదింపులు జరిగాయని.. కథను మెచ్చిన ఆమె, ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అంతేకాదు మూవీ షూటింగ్ కూడా పాటతోనే మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఇంతకుముందు చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అప్పుడు యావరేజ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కబోతోన్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..