తమిళ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఇందులో మరో హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. తాజాగా మాస్టర్ 4వ ప్రోమోను శుక్రవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో అందం వాడి చూపేరా అంటూ వచ్చే సాంగ్ అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా ఈ వీడియోలో కాలేజీ లెక్చరర్‌గా మాలవికా మోహనన్ గ్రేస్ లుక్‌లో అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు, తమిళంలో జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటీకే విడుదలై ప్రోమోలను చూస్తే ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది.
Small break for the mass promos. Here’s a lovely romantic promo from #Master this time.. @actorvijay @MalavikaM_
A @Dir_Lokesh film .. @XBFilmCreators @Lalit_SevenScr @Jagadishbliss @SonyMusicSouth #మాస్టర్ pic.twitter.com/PXVOM3zGlj
— Mahesh Koneru (@smkoneru) January 8, 2021