Red Movie In OTT: ఓటీటీలోకి ఎనర్జిక్ట్ స్టార్ రామ్ ‘రెడ్’ సినిమా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'రెడ్'. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘రెడ్’. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, అమృతా అయ్యార్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సినిమా ‘తడమ్’కు ఇది రీమేక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ హిట్ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన ‘రెడ్’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఈ నెల 23న స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Confirmed: Telugu film #Red is coming to NETFLIX, February 23rd. @ramsayz @Actor_Amritha @Nivetha_Tweets @ImMalvikaSharma pic.twitter.com/RqotSTAzc0
— LetsOTT GLOBAL (@LetsOTT) February 16, 2021
Also Read:
20 years of Mahesh Babu’s Murari : 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ బాబు క్లాసిక్ సూపర్ హిట్ ‘మురారి’