‘సాహో’ టీజర్ ఎప్పుడంటే..?

| Edited By: Srinu

Jun 10, 2019 | 6:42 PM

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ నిర్మాతలు స్వీట్ న్యూస్ అందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ డేట్‌ను ఇవాళ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ, హిందీ, […]

సాహో టీజర్ ఎప్పుడంటే..?
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ నిర్మాతలు స్వీట్ న్యూస్ అందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ డేట్‌ను ఇవాళ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్, మురళీ శర్మ, మందిరా బేడీ, అరుణ్ విజయ్, జాకీ షరీఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.