బుల్లితెరపై మరోసారి మెరవనున్న ఎన్టీఆర్.. కొత్త టాక్ షోకు నో రెమ్యునరేషన్.!! అసలు సంగతి ఇదే..

|

Dec 17, 2020 | 3:52 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఓ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ త్వరలో ప్రసారం చేయనున్న టాక్ షోకు..

బుల్లితెరపై మరోసారి మెరవనున్న ఎన్టీఆర్.. కొత్త టాక్ షోకు నో రెమ్యునరేషన్.!! అసలు సంగతి ఇదే..
Follow us on

NTR Talk Show: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఓ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ త్వరలో ప్రసారం చేయనున్న టాక్ షోకు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించనున్నాడని టాక్. ఇక గతంలో తారక్ ‘బిగ్ బాస్’ సీజన్ 1కి వ్యాఖ్యాతగా అలరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ షో పెద్ద హిట్ అయింది.

మళ్లీ ఇన్నాళ్లకు తారక్ మరోసారి మైక్ పట్టుకోబోతున్నారు. అయితే బిగ్ బాస్ షోకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. ఈ టాక్ షోకు పారితోషికం తీసుకోవట్లేదని తెలుస్తోంది. అవునండీ.! ఇది నిజమే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా మారనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్‌లోనే తారక్ టాక్ షో చేస్తాడని సమాచారం.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..?