Sardar Trailer: స్పై పాత్రలో ఇరగదీసిన కార్తీ.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసిన సర్దార్‌ ట్రైలర్‌..

కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్దార్‌. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కారీ మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్న చిత్రమే ఈ సర్దార్‌. పీఎస్‌ మిత్రాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు...

Sardar Trailer: స్పై పాత్రలో ఇరగదీసిన కార్తీ.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసిన సర్దార్‌ ట్రైలర్‌..
Sardar Trailer

Updated on: Oct 15, 2022 | 9:30 AM

కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్దార్‌. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కారీ మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్న చిత్రమే ఈ సర్దార్‌. పీఎస్‌ మిత్రాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన టీజర్‌లు, ఫస్ట్‌లుక్‌లో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. అక్టోబర్ 21న తెలుగుతోపాటు, తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. 2.21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కార్తీ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రతో పాటు ఒక స్పై పాత్రలోనూ కనిపిస్తున్నాడు. దీంతో కార్తీ ఇందులో డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడా అన్న అనుమానం రాక మానదు. దేశ భద్రతకు సంబంధించి దొంగలించబడిన కీలక పత్రాలను కార్తీ ఎలా సాధించాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీఖ‌న్నా, ర‌జిష విజ‌య‌న్‌, లైలా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ల‌క్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సర్దార్‌ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేస్తుండడం విశేషం. మరి ఈ సినిమా కార్తీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..