పబ్జీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అక్షయ్ ‘ఫౌజీ’ గేమ్ వచ్చేసింది.. ప్లేస్టోర్‏లో డౌన్‏లోడ్ చేసుకోవడం సులభమే ఇక..

|

Jan 27, 2021 | 12:06 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'ఫౌజీ' గేమ్ వచ్చేసింది. ఈ మొబైల్ గేమ్‏ను గణతంత్ర దినోత్సవం సందర్బంగా నిన్న విడుదల చేశారు. ఇందుకు

పబ్జీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అక్షయ్ ఫౌజీ గేమ్ వచ్చేసింది.. ప్లేస్టోర్‏లో డౌన్‏లోడ్ చేసుకోవడం సులభమే ఇక..
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘ఫౌజీ’ గేమ్ వచ్చేసింది. ఈ మొబైల్ గేమ్‏ను గణతంత్ర దినోత్సవం సందర్బంగా నిన్న విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‏ను ట్విట్టర్‏లో షేర్ చేశారు. గతేడాది పబ్జీతో సహా పలు చైనా యాప్‏లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్షయ్ తాను భారత్ వెర్షన్‏కు చెందిన ఫౌజీ గేమ్‏ను రూపొందించనున్నట్లు గతంలో అక్షయ్ ప్రకటించారు. ఇటీవలే ఫౌజీ గేమ్‏కు సంబంధించిన ఓ వీడియోను అక్షయ్ షేర్ చేశారు.

ఇందులో భాగంగా శత్రువును ఎదుర్కోండి. మీ దేశం కోసం పోరాడండి. మన జెండాను రక్షించండి. భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ గేమ్ ఫౌజీ. ఇది ఫియర్ లెస్, యునైటెడ్ గార్డ్స్, ఈ గేమ్ మిమ్మల్సి ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజే మీ మిషన్‏ను ప్రారంభించండి అని అక్షయ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ గేమ్‏కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో గతేడాది జరిగిన భారత్ చైనా మధ్య గాల్వన్ వ్యాలీలో జరిగిన యుద్ధం ఉండనున్నట్లుగా సమాచారం. ఈ గేమ్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో మాత్రమే ఉండనుంది. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానున్నట్లుగా కంపెనీ వెల్లడించింది. ప్లేస్టోర్‏లో ఈ గేమ్ అందుబాటులో ఉండనుంది.

Also Read:  నా సినిమా వాళ్లకు నచ్చదని నాకు ముందే తెలుసు.. లక్ష్మిపై అక్షయ్‌ స్పందన