Taapsee Pannu : బీ టౌన్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్న తాప్సీ.. ఎడారిలో వర్కవుట్ చేస్తుంది ఎందుకో..
ఢిల్లీ బ్యూటీ తాప్సీ మోడలింగ్ రంగం నుంచి టాలీవుడ్ లో ఝమ్మంది నాదం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది.. అనంతరం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పింకీ మూవీ లో తన నటనతో విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది . తనకు గ్లామర్ పాత్రతో
Taapsee Pannu : ఢిల్లీ బ్యూటీ తాప్సీ మోడలింగ్ రంగం నుంచి టాలీవుడ్ లో ఝమ్మంది నాదం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది.. అనంతరం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పింకీ మూవీ లో తన నటనతో విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. తనకు గ్లామర్ పాత్రతో యూత్ ను ఆకట్టుకోవడమే కాదు.. నటనతో అందరినీ కట్టిపడేస్తా అని చెప్పకనే చెప్పింది. ఈ సొట్టబుగ్గల సుందరి డిఫరెంట్ నేపధ్య కథలతో తనకంటూ ఓ ఫేమ్ ను సొంతం చేసుకుంది. బీ టౌన్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో వరస హిట్స్ అందుకుంటుంది చిన్నది. తాజాగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘రష్మీ రాకెట్’ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాలో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీ.. ప్రత్యేక శిక్షణ తీసుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంతో సాగుతున్న ‘రష్మీ రాకెట్’ చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తుండగా రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖంద్‌దియా నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్యూటీ ఫిట్ నెస్ లవర్ అని తెలిసిందే. ‘రష్మీ రాకెట్’ సినిమా షూటింగ్ పూర్తవగా అక్కడి ఎడారిదారుల్లో తాప్సీ వర్కవుట్ చేస్తూ ఆ ప్రదేశాన్ని వీడింది. ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. చెన్నై లో మూడేళ్ళ క్రితం తాను విన్న ఓ అంశాన్నే సినిమా నేపధ్యంగా తీసుకున్నామని.. అసలు ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో వివరించడానికి తనకు సమయం లేదని.. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో తన ఫీలింగ్స్ ను పంచుకోవడానికి ఇక్కడ స్థలం కూడా సరిపోదని ఫోటో తో పాటు ట్విట్ కూడా చేసింది తాప్సి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: సినిమా కలెక్షన్లోనే కాదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న ప్రభాస్