MeToo: లైంగిక వేదింపుల కేసుల్లో ప్రముఖ నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష

|

Dec 21, 2022 | 10:29 AM

చలనచిత్ర రంగంలో మీటూ ఉద్యమం ఖాండాంతరాలను దాటింది. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ వంటి ఇండియన్‌ ఫిన్స్‌ ఇండస్ట్రీలలోనే కాకుండా హాలీవుడ్‌ కూడా మీటూ ఉద్యమంపై బలంగా గళం వినిపిస్తోంది. తాజాగా ప్రముఖ..

MeToo: లైంగిక వేదింపుల కేసుల్లో ప్రముఖ నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష
Metoo
Follow us on

చలనచిత్ర రంగంలో మీటూ ఉద్యమం ఖాండాంతరాలను దాటింది. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ వంటి ఇండియన్‌ ఫిన్స్‌ ఇండస్ట్రీలలోనే కాకుండా హాలీవుడ్‌ కూడా మీటూ ఉద్యమంపై బలంగా గళం వినిపిస్తోంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌ (70) అత్యాచార కేసులో సోమవారం (డిసెంబర్‌ 19) దోషిగా తేలాడు. హార్వే వేన్‌స్టీన్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిర్దారణ కావడంతో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టు దోషిగా ప్రకటించింది. 2013లో ఓ ఇటాలియన్‌ నటి, మోడల్‌పై ఆయన అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2004 నుంచి 2013 వరకు నలుగురు మహిళలపై దాదాపు 7 ఆరోపణలు వచ్చాయి.

వీటిల్లో మూడు నేరాలు నిర్ధారణ కావడంతో కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై న్యాయవాదులు మంగళవారం (డిసెంబర్‌ 20) వాదనలు వినిపించారు. వేన్‌స్టీన్‌ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ..వేన్‌స్టీన్‌ నిర్దోషి అని, తమ కెరీర్‌కు సహాయం చేస్తాడని సదరు మహిళలు వేన్‌స్టీన్‌తో ఇష్టపూర్వకంగానే సంబంధాలు పెట్టుకున్నారని, రెండు కేసుల్లో వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా కల్పితాలని అన్నారు. ఐతే బాధిత మహిళలు బలమైన సాక్షాలు సమర్పించడంతో నేరాలు రుజువయ్యాయి. కాగా ఇప్పటికే ఓ మహిళపై అత్యాచారం కేసుల్లో నేరాలు రుజువుకావడంతో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Harvey Weinstein

దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన వేన్‌స్టీన్‌, తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది హాలీవుడ్‌ నటీమణులు, ఇతర మహిళలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మీడియా, రాజకీయాలు, ఇతర రంగాల్లో ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఊపందుకున్న మీటే ఉద్యమం వీన్‌స్టీన్‌పై ఆరోపణలకు ఆజ్యం పోశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.