తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటిస్తూ మెప్పిస్తోన్న హరీశ్ ఉత్తమన్ పెళ్లిపీటలెక్కాడు. మలయాళ నటి చిన్ను కురువిల్లను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కేరళ మవెలిక్కరలోని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వీరి వివాహం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్, చిన్ను గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎవరకు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుని షాక్ ఇచ్చారు. కాగా రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో నిలబడి ఉన్న ఈ వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
ప్రేమ బంధాన్ని పెళ్లిగా…
కురువిల్ల పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ‘నార్త్ 24 కతమ్’, ‘కసాబా’, ‘లుక్కా చుప్పి’ తదితర చిత్రాలతో మలయాళ సినీ ప్రియులకు బాగా చేరువైంది. ఇక హరీశ్ విషయానికి వస్తే .. 2010లో ఓ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. అనతికాలంలోనే ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘గౌరవం’, ‘పవర్’, ‘శ్రీమంతుడు’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘జై లవకుశ’, ‘అశ్వద్ధామ’ ‘వి’ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులకు బాగా చేరవయ్యాడు. గతేడాది నాంది చిత్రంలో విలన్ గా మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. కాగా హరీశ్ కు 2018 లోనే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్‌తో వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఏడాదికే విడిపోయి విడాకులు తీసుకున్నారు.
Happy Married life #HarishUthaman ❤️ #ChinnuKuruvila pic.twitter.com/lsaYAlOQ0k
— Plumeria Movies (@plumeriamovies) January 20, 2022
Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..
YouTube Channels: మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం