
Harbhajan Singh Friendship: తన స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్ హర్బజన్ సింగ్ ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. హర్బజన్ తొలి సినిమా ‘ఫ్రెండ్ షిప్’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్ పాల్ శామ్, శామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తుండడం విశేషం. భారీ ఎత్తున తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి రావడంతో మేకర్స్ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హర్బజన్ ఓ కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ట్రైలర్‌ను గమనిస్తే బజ్జీ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను ఈ సినిమా ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించే సమాజ తీరును మేకర్స్ ప్రశిస్తున్నట్లు ట్రైలర్ ఉంది.
ట్రైలర్‌లో వచ్చిన.. ‘ఏ ఒక్క స్త్రీ, మగవాడి ప్రత్యేక అవసరం కోసం సృష్టించింది కాదు.. ఆడది అంటే మనకు బాధ్యత. ఈ అందమైన విషయాన్ని మాకు నేర్పింది ఫ్రెండ్‌షిప్’ అనే వచ్చే డైలాగ్ సినిమా కథాంశాన్ని చెప్పకనే చెప్పేసింది. మరి తన బౌలింగ్‌తో మ్యాచ్‌లో మ్యాజిక్ చేసిన హర్బజన్.. హీరోగా ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. సినిమా ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌లే టార్గెట్.!
Viral Photo: ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?