AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ విలన్.. అమ్మడు ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..

తెలుగు బుల్లితెరపై తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సీరియల్లలో విలన్ పాత్రలతో తనదైన నటనతో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ లుక్కులో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ విలన్.. అమ్మడు ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..
Jyotika Muniratnam
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2026 | 12:48 PM

Share

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి జ్యోతిక మునిరత్నం. ఇప్పుడిప్పుడే స్మాల్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో, ముఖ్యంగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తక్కువ సమయంలోనే నటిగా అందరి హృదయాలు గెలుచుకుంది. ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లోని ‘రోహిణి’ పాత్రతో ఆమె చేసిన నటనా మాయాజాలం తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే సీరియల్లో పద్దతిగా ఉండే రోహిణి.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో నెట్టింట మెంటలెక్కిస్తుంది. జ్యోతిక కన్నడ బుల్లితెర పరిశ్రమ ద్వారా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. కన్నడలో అనుభవం సంపాదించుకున్న తర్వాత, ఆమె తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.’కళ్యాణి’ సీరియల్‌లో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ఆమె పోషిస్తున్న ‘రోహిణి’ నెగటివ్ పాత్ర కథకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ పాత్రలో ఆమె చేసే ప్లాన్స్, విలనిజం ప్రేక్షకులకు కోపం తెప్పించినా, నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

జ్యోతిక కర్ణాటకకు చెందిన అమ్మాయి. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, నటనపై ఉన్న మక్కువతో గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. సీరియల్స్‌లో ఎప్పుడూ చీరకట్టుతో, పద్ధతిగా కనిపించే జ్యోతిక, నిజ జీవితంలో మాత్రం చాలా మోడ్రన్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే వెస్ట్రన్ ఫొటోషూట్స్ చూస్తుంటే, ‘ఈమె నిజంగానే రోహిణీనా?’ అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు.

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై క్రేజ్ ఉన్న విలన్ పాత్రధారుల్లో జ్యోతిక ఒకరు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె తన పాత్రల డిమాండ్‌ను బట్టి రోజుకు సుమారు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు పారితోషికం అందుకుంటున్నట్లు అంచనా. కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా, భవిష్యత్తులో వెండితెరపై కూడా మంచి పాత్రలు చేయాలని ఈమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటిగా ప్రూవ్ చేసుకున్న జ్యోతిక, సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం జ్యోతిక షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

జ్యోతిక పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us