Tollywood : వాటే ఛేంజ్ భయ్యా.. ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. నిత్యం ఏదోక త్రోబ్యాక్ పిక్చర్ నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

అప్పుడప్పుడు, నటీనటులకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా.. ? ఈ నటి 2015లో మలయాళ చిత్రసీమలో కథానాయికగా పరిచయమయ్యారు . ఆమె మొదటి సినిమాకు దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ద్వారా ఆమె దక్షిణాదిలో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత, ఆమె మలయాళ చిత్రసీమలో కథానాయికగా నటించి మెప్పించారు. ఆమె విజయ్ సేతుపతి సరసన తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేశారు. ఈ నటి మరెవరో కాదు, మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్. మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి, ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాలెంటెడ్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
2015లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ (Premam) ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘సెలిన్’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే కేరళలోనే కాకుండా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేసినప్పుడు కూడా ఆమె తన పాత్రను తానే పోషించి ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. విజయ్ సేతుపతి సరసన ‘కాదలుం కడ పోగుం’ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత విజయ్ సేతుపతితో కలిసి మరికొన్ని సినిమాల్లో నటించి లక్కీ జోడిగా పేరు తెచ్చుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
ఇక ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం దళపతి విజయ్ నటించిన ‘లియో’ (Leo). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో విజయ్ సోదరిగా (ఎలిసా దాస్) నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ పాత్ర ఆమెకు సినిమా ఇండస్ట్రీలో మరింత పెద్ద గుర్తింపును తీసుకువచ్చింది. కేవలం నటనలోనే కాకుండా మడోన్నా ఒక అద్భుతమైన గాయని కూడా. ఆమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు సినిమాల్లో కూడా పాటలు పాడారు. ప్రస్తుతం తమిళం, మలయాళం , తెలుగు భాషల్లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన సినిమా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
మడోన్నా సెబాస్టియన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
