పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న బుడ్డోడు.. ఇప్పుడొక స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు. ముద్దుగా అతడ్ని ఫ్యాన్స్ బాద్‌షాగా పిలుస్తుంటారు. ఆ హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిందంటే.. కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టాల్సిందే. ఇప్పటికైనా తెలిసిందా.? మీకు ఆ హీరో ఎవరన్నది.? ఒకవేళ తెలియకపోతే.. ఓ క్లూ ఇస్తాం.. ఐదేళ్ళుగా సరైన హిట్ లేని.. ఆ స్టార్ హీరో.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తన తాజా చిత్రంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఎస్.. మీ గెస్ కరెక్టే..! అతడెవరో కాదు షారుఖ్ ఖాన్.
ఇండియన్ బాద్‌షాగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు షారుఖ్ ఖాన్. గత కొన్నేళ్లుగా ఈ స్టార్ హీరోకు హిట్టే కరువైంది. వరుస ఫ్లాపులతో మార్కెట్ కూడా డౌన్ అయింది. అయితేనేం.. ఇదంతా పక్కనపెడితే.. దాదాపు ఐదేళ్ల తర్వాత షారుఖ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘పఠాన్’. దీనికి సిద్ధార్ద్ ఆనంద్ దర్శకుడు కాగా, హీరోయిన్‌గా దీపిక పదుకుణే నటించింది. అలాగే మరో హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించాడు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తోంది.
మొదటి రోజే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేయగా.. వరుసగా 4 రోజుల్లో రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. మరోసారి బాలీవుడ్ బాద్‌షా స్టామినా ఇదేనంటూ రుజువు చేస్తోంది. వరుస డిజాస్టర్లు.. సినిమా సినిమాకు గ్యాప్.. ఇవేం ఉన్నా కూడా షారుఖ్ ఖాన్ ఎప్పుడూ తన ఫ్యాన్స్‌కు బాలీవుడ్ బాద్‌షానే.. షారుఖ్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు.. బీ-టౌన్‌లో బాద్‌షా అనిపించుకున్న ఏకైక హీరో.