RRR: నాటు నాటు పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌..

|

Nov 12, 2021 | 3:47 PM

'నాటు నాటు'..ప్రస్తుతం తెలుగునాట ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి విడుదలైన ఈ పాట టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది.

RRR: నాటు నాటు పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌..
Follow us on

‘నాటు నాటు’..ప్రస్తుతం తెలుగునాట ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి విడుదలైన ఈ పాట టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. సమంత లాంటి సెలబ్రిటీలు కూడా ఈ పాటను అభినందిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అలా తాజాగా ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ బామ్మ. వయసనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది.

బామ్మ ఉత్సాహానికి హ్యాట్సాఫ్‌..
బామ్మ ‘నాటు’ డ్యాన్స్‌ను అభినందిస్తూ ఈ వీడియోను తమ అధికారిక సోషల్‌ మీడియాలో పంచుకుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం. ‘బామ్మగారు’ అంటూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ‘బామ్మ గారు మీ ఉత్సాహానికి హ్యాట్సాఫ్‌’, ‘మీ డ్యాన్స్‌ కెవ్వు కేక’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!

బిగ్ బాస్‌ హౌస్‌లో అప్పడాల లొల్లి.. సన్నీ, షణ్ముఖ్ మధ్య రాజుకున్న యుద్ధం.. అస్సలు తగ్గేదే..లే!