Shah Rukh Khan: షారుఖ్‌ వ్యాఖ్యలపై స్పందించిన గూగుల్‌.. ఆసక్తికరమైన ట్వీట్..

ఎన్ని రికార్డులతో పాటు మరెన్నో అవార్డులు సైతం షారుఖ్‌ వశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా 77వ లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్లో షారుఖ్‌ ఖాన్‌ ప్రతిష్టాత్మక పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకున్నారు. స్విట్టర్లాండ్‌ వేదికగా జరిగిన ఈవెంట్‌లో అవార్డును అందుకున్న షారుఖ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఈ అవార్డును అందించారు...

Shah Rukh Khan: షారుఖ్‌ వ్యాఖ్యలపై స్పందించిన గూగుల్‌.. ఆసక్తికరమైన ట్వీట్..
Shah Rukh Khan
Follow us

|

Updated on: Aug 13, 2024 | 4:09 PM

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు షారుఖ్‌. ఒకప్పుడు ఆడిషన్స్‌ కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన స్థాయి నుంచి నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన సినిమా తారల్లో ఒకరిగా ఎదిగారు షారుఖ్‌. అయితే ఇదంతా ఒక్క రోజులో రాలేదు. షారుఖ్‌ ఎన్నో ఏళ్ల కృషి ఫలితమే ఇది.

ఎన్ని రికార్డులతో పాటు మరెన్నో అవార్డులు సైతం షారుఖ్‌ వశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా 77వ లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్లో షారుఖ్‌ ఖాన్‌ ప్రతిష్టాత్మక పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకున్నారు. స్విట్టర్లాండ్‌ వేదికగా జరిగిన ఈవెంట్‌లో అవార్డును అందుకున్న షారుఖ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఈ అవార్డును అందించారు. ఇలాంటి గౌరవాన్ని పొంది చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్‌ నటుడిగా షారుఖ్‌ నిలవడం విశేషం.

ఈ క్రమంలోనే ఈ అవార్డు అందుకున్న సందర్భంలో షారుఖ్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘నా గురించి తెలియక పోతే గూగుల్‌ను అడగండి. అది ఏం చెబుతుందో విని నన్ను ప్రశ్నలు అడగండి’ అని షారుఖ్‌ సరదాగా మాట్లాడారు.

దీంతో షారుఖ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏకంగా గూగుల్‌ స్పందించింది. గూగుల్‌ ఇండియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. షారుఖ్‌ అంటే.. కింగ్‌ అనే అర్థం వచ్చేలా.. కిరీటం ఎమోజీని పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నిజంగానే షారుఖ్‌ ఇండియన్‌ సినిమాకు కింగ్‌ అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. గూగుల్‌ చేసిన ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

గూగుల్ చేసిన ట్వీట్..

కాగా ఈ ఈవెంట్ షారుఖ్‌ సౌత్‌ ఇండియా ఫిలిమ్‌ ఇండస్ట్రీపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఇండస్ట్రీలో ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న టెక్నీషియన్స్‌ ఉన్నారన్నారు. భారతీయ సినీ రంగంలో గొప్ప సూపర్‌ స్టార్‌లు చాలా మంది సౌత్‌ నుంచి వచ్చిన వారేనని షారుఖ్‌ చెప్పుకొచ్చారు. మణిరత్నంతో కలిసి దిల్‌సే నటించానని, అంతకు మించి తనకేం కావాలంటూ షారుఖ్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!