Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokshagnya: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ

నందమూరి మోక్షజ్ఞను తన తండ్రి బాలకృష్ణతో కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్ లో ప్రేక్షకులు చూసి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేట్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. మోక్షజ్ఞ లాంచ్ ఈ ఏడాదే జరుగుతుందని సమాచారం.

Mokshagnya: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ
Mokshagna
Follow us
Balu Jajala

|

Updated on: Mar 18, 2024 | 11:56 AM

నందమూరి మోక్షజ్ఞను తన తండ్రి బాలకృష్ణతో కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్ లో ప్రేక్షకులు చూసి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేట్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. మోక్షజ్ఞ లాంచ్ ఈ ఏడాదే జరుగుతుందని సమాచారం. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ మాస్ డైరెక్టర్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి. అయితే బోయపాటి నెక్ట్స్ మూవీ మోక్షజ్ఞతోనే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయని, పుకార్లు రోజురోజుకు బలపడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు. ‘ఆదిత్య 369’ సీక్వెల్ లో కూడా ఆయన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు అవుతాడో లేదో చూడాలి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. వెండితెరపై చాలా మంది స్టార్ కిడ్స్ ఫెయిల్ అవ్వడం చూశాం కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆ ఒత్తిడిని మోక్షజ్ఞ సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

ఈ నందమూరి వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. బాలయ్య తన కుమారుడి మూవీ కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అయితే బాలయ్యతో హ్యాట్రిక్ బోయపాటి తో సినిమా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందుకోసం మోక్షజ్ఞ కూడా బాడీగా మంచి ఫిజిక్ గా మలిచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే గతంలో చాలామంది హీరోలు తమ కుమారులచే ఎంట్రీ ఇప్పించినప్పటికీ.. కొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. అందుకే బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా లేదా అని వేచి చూడాల్సిందే.