Gautham Menon: ఏమాయ చేసావేలో హీరోగా మొదట అనుకుంది నాగచైతన్యది కాదంటా.. మరెవరో తెలుసా.?

|

Sep 18, 2022 | 7:28 PM

Gautham Menon: గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏమాయ చేసావే' సినిమా వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన ఈ సినిమా..

Gautham Menon: ఏమాయ చేసావేలో హీరోగా మొదట అనుకుంది నాగచైతన్యది కాదంటా.. మరెవరో తెలుసా.?
Ye Maaya Chesave
Follow us on

Gautham Menon: గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమా వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు రికార్డు కలెక్షన్లను రాబట్టింది. అద్భుత ప్రేమ కావ్యంగా వచ్చిన ఈ సినిమా యువతను ఉర్రూతలుగించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో శింబు, త్రిష ప్రధాన తారగణంతో తెరక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు.

ఏమాయ చేసావే సినిమా స్క్రిప్ట్‌ను రాసిన సమయంలో హీరోగా నాగచైతన్యను అనుకోలేదని గౌతమ్‌ మీనన్‌ తెలిపారు. మొదట మహేశ్‌ బాబును హీరోగా తీసుకోవలని భావించారంటా.. కానీ మహేష్‌ అప్పటికే ‘పోకిరి’తో భారీ విజయాన్ని అందుకున్న క్రమంలో.. క్లాస్‌ కాకుండా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నరంటా.. దీంతో అలా సినిమాలో శింబు, నాగచైతన్య నటించాల్సి వచ్చింది అని గౌతమ్‌ తెలిపారు.

ఇక ఒకే రంగానికి చెందిన వాళ్లు వివాహం చేసుకోవచ్చా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇద్దరు కలవడానికి, లేదా విడిపోవడానికి రూల్స్‌ అంటూ ఏమీ లేవు. బంధంలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. రెండు మనసులు కలిస్తే చాలు.. ఒకే రంగానికి చెందిన వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండాలని, ఉండకూడదని ఏమీ లేదని’ గౌతమ్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..