Manjima Mohan: అందుకే నీతో లవ్‌లో పడిపోయా.. ఆ హీరోతో ప్రేమయణంపై ఓపెన్ అయిన కోలీవుడ్ బ్యూటీ

ఎట్టకేలకు తన ప్రేమాయణంపై పెదవి విప్పింది మంజిమా.  కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా  ప్రకటించింది. ప్రియుడితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..

Manjima Mohan: అందుకే నీతో లవ్‌లో పడిపోయా.. ఆ హీరోతో ప్రేమయణంపై ఓపెన్ అయిన కోలీవుడ్ బ్యూటీ
Gautham Karthik, Manjima

Updated on: Nov 28, 2022 | 2:11 PM

కోలీవుడ్‌ హీరో, హీరోయిన్లు గౌతమ్‌ కార్తీక్‌, మంజిమా మోహన్‌ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కూడా వీరి ప్రేమ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ వస్తోంది మంజిమా. ‘అతని ప్రేమను ఇంకా అంగీకరించలేదని.. ఒకవేళ నిజంగా లవ్‌లో పడితే కచ్చితంగా అందరికీ చెప్తాను’ అని తప్పించుకుంటూ వస్తోంది. అయితే ఎట్టకేలకు తన ప్రేమాయణంపై పెదవి విప్పింది మంజిమా.  గౌతమ్ కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా  ప్రకటించింది. ప్రియుడితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘ మూడేళ్ల క్రితం నా లైఫ్‌లోకి అడుగుపెట్టావు. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించావు. అన్నీ కోల్పోయి దిక్కుతోచని పరిస్థితులెదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఉండాలని నేర్పించావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు. అందుకే నీతో ప్రేమతో పడిపోయాను. నువ్వు నన్ను ప్రేమించిన తీరే నీలో నాకు నచ్చింది. నా లైఫ్‌ లో నువ్వు ఎప్పటికీ ప్రత్యేకమే’ అని తన ప్రేమకు అక్షర రూపమిచ్చింది మంజిమ.

ఇక వేచి ఉండలేను..

అటు గౌతమ్‌ కూడా ఇవే ఫొటోలను షేర్‌ చేసి ‘ మా స్నేహం గాఢమైన ప్రేమగా మారినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించడానికి ప్రేమ అనే పదం కూడా సరిపోదేమో. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. నీ నుంచి ప్రతినిత్యం కడదాకా ప్రేమను పొందనివ్వుఒక్కటిగా ప్రయాణం మొదలు పెట్టేందుకు ఇక వేచి చూడలేను’ అని ఇన్‌స్టా వేదికగా తమ రిలేషన్‌షిప్‌పై ఓపెన్‌ అయ్యాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కంగ్రాట్స్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాతో..

కాగా అభినందన, అన్వేషణ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్‌ వారసుడే ఈ గౌతమ్‌ కార్తీక్‌. కాదల్‌ (తెలుగులో కడలి) తో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. ఇక మంజిమా మోహన్‌ విషయానికొస్తే.. తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించింది. ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొన్ని నెలల క్రితం విష్ణు విశాల్‌ ఎఫ్‌ఐఆర్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించింది. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి దేవరట్టం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి ప్రేమకు పునాది పడింది. మొదట మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..