AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మంచి ట్విస్టులున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ హాలీవుడ్ సినిమాకు మీకు మంచి ఛాయిస్. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సులభంగా అర్థమయ్యేందుకు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 02, 2026 | 10:09 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఒక హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమంగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ‘ది రన్నర్’ (The Runner). ‘వండర్ వుమెన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన గాల్ గాడోట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది.

ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ తెరకెక్కించిన ది రన్నర్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ది రన్నర్ సినిమా అందుబాటులో ఉంది.

‘ద రన్నర్’ సినిమా స్టోరీ  విషయానికొస్తే.. లండన్‌లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్‌లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఒక కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను చెప్పిన పనులన్నీ చేస్తేనే కొడుకుని అప్పగిస్తానని ఆమెని బెదిరిస్తాడు. మరి సదరు మహిళ.. కిడ్నాపర్ చెప్పిన పనులన్నీ చేసిందా? కొడుకును కాపాడుకుందా?  ఈ క్రమంలో  ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది తెలుసుకోవాలంటే ది రన్నర్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ది రన్నర్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us