బ్యూటీ అనంతకి సనీల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ చిన్నది మ్యాడ్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక దీని తర్వాత ఎనిమిది వసంతాలు మూవీలో నటించి, ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
ఈ బ్యూటీ మల్టీ ట్యాలెంటెడ్. రీల్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టింది. మూవీలో తన నటనతో ఆకట్టుకుంది.
ఎనిమిది వసంతాలు మూవీలో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిన్నది తన డ్యాన్స్‌తో కూడా అందరి మనసు దోచుకుంది.
నటన, అందం, డ్యాన్స్, ఇలా అన్నింట్లో మంచి ప్రతిభ కనబరిచిన ఈబ్యూటీ తెలుగు అభిమానుల మనసులో తనకుంటూ స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రోమాంచికం అనే సినిమాలో నటిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా తెల్ల చీర, తల్లో పూలతో ఆకట్టుకుంటుంది