AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapathi Egg Roll: పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్! ఇలా చేస్తే ఒకటి కాదు.. పది తింటారు

పిల్లలు రోజూ చపాతీలు తినడానికి మారాం చేస్తుంటారు. అదే సమయంలో కూరగాయలు తినడానికి కూడా వెనుకాడతారు. అలాంటి వారికి పోషకాలు సమృద్ధిగా అందేలా గోధుమపిండి చపాతీపై కోడిగుడ్డును కాల్చి, మధ్యలో క్రంచీ వెజిటబుల్స్ స్టఫింగ్ ఉంచి 'చపాతీ ఎగ్ రోల్' చేసి పెడితే ఒక్కటి తిన్నా కడుపు నిండిపోవడమే కాకుండా ఎంతో ఇష్టంగా ఖాళీ చేసేస్తారు. వీధుల్లో అమ్మే జంక్ ఫుడ్ రోల్స్ కంటే ఎన్నో రెట్లు స్వచ్ఛంగా, ఇంట్లోనే పరిశుభ్రమైన పద్ధతిలో చేసుకునే ఈ స్ట్రీట్ స్టైల్ చపాతీ ఎగ్ ఫ్రాంకీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

Phani CH
|

Updated on: Sep 02, 2026 | 8:42 PM

Share
కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమపిండి, 4 నుండి 5 కోడిగుడ్లు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అర కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు సన్నగా తురిమిన క్యాబేజీ, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత చాట్ మసాలా, టమాటా సాస్ / కెచప్, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.

1 / 5
తయారీ విధానం: ఒక బౌల్‌లో కప్పు గోధుమపిండి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్‌గా ముద్దలా కలుపుకోవాలి. మూతపెట్టి 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేయాలి.

2 / 5
నూనె వేడయ్యాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో ఒకటి నుండి రెండు నిమిషాలు వేయించాలి గమనిక:ముక్కలు మెత్తబడకూడదు, క్రంచీగా ఉండాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి టాస్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఒక గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి, కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి. నానిన గోధుమపిండిని సమాన భాగాలుగా తీసుకుని మీడియం మందంతో చపాతీల్లా ఒత్తుకోవాలి. పెనం వేడి చేసి చపాతీని రెండు వైపులా కొద్దిగా నూనె వేస్తూ దోరగా కాల్చుకోవాలి.

4 / 5
చపాతీ బాగా వేగిన తర్వాత దానిపై బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని సమానంగా పరవాలి. ఆ వెంటనే చపాతీని రెండో వైపుకు తిప్పి, లో ఫ్లేమ్‌లో ఎగ్ ఆమ్లెట్ లాగా పర్ఫెక్ట్‌గా కాలే వరకు కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఎగ్ వేగిన చపాతీని బోర్డుపై పెట్టి, మధ్యలో ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటబుల్ స్టఫింగ్‌ను ఉంచాలి. పైన కొద్దిగా చాట్ మసాలా చల్లి, టమాటా కెచప్‌ను వేయాలి. ఇప్పుడు చపాతీని ఒకవైపు నుండి గట్టిగా రోల్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే హెల్తీ చపాతీ ఎగ్ రోల్ సిద్ధం! ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కైనా, పిల్లల లంచ్‌బాక్స్‌కైనా ఇది పరిపూర్ణమైన ఆహారం!

5 / 5
Follow Us
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?

బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం

కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?

విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు

ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్

పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం

ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు?