AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gabbar Singh Ramesh: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు రమేశ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (జులై 22) ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Gabbar Singh Ramesh
Basha Shek
|

Updated on: Jul 22, 2026 | 6:21 PM

Share

టాలీవుడ్ నటుడు, ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రమేష్‌కు ఐసీయూలో ఉన్నాడు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే రమేష్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. న్యూరాలజిస్టులు సహా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తోందని చెబుతున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, శరీర స్పందనలను బట్టి తదుపరి చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు రమేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

2012లో పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ తోనే  తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు రమేష్. అందులో విలన్ గ్యాంగ్ సభ్యుడిగా కనిపించారాయన. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ తో రమేష్ కు మంచి గుర్తింపు వచ్చింది.  ఆ తర్వాత పవన్ కల్యాణే నటించిన అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లోనూ కామెడీ విలన్ పాత్రలు పోషించాడు. వీటితో పాటు పలు తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించాడు రమేష్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రమేశ్‌ యాక్టివ్ గా ఉంటాడు. రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఉన్నట్లుండి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రమేష్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రెండు రోజుల క్రితమే షూటింగ్ లో.. ఇప్పుడు ఆస్పత్రిలో..

ఇటీవల ఫ్యామిలీ ఫంక్షన్ లో నటుడు రమేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us