AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస పరిణామాలు.. హాట్‌ టాపిక్‌గా ‘సూర్య’ సినిమాలు..ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ ఏంటంటే..!

కరోనా విజృంభణ, మిడతల దాడి... ఇలా వరుస పరిణామాలను ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తోంది. అయితే వీటిన్నింటిని ముందుగానే ఊహించారు సూర్య దర్శకులు.

వరుస పరిణామాలు.. హాట్‌ టాపిక్‌గా 'సూర్య' సినిమాలు..ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ ఏంటంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2020 | 12:40 PM

Share

కరోనా విజృంభణ, మిడతల దాడి… ఇలా వరుస పరిణామాలను ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తోంది. అయితే వీటిన్నింటిని ముందుగానే ఊహించారు సూర్య దర్శకులు. ఆయనతో తెరకెక్కించిన పలు సినిమాల్లో ఈ పరిణామాలన్నింటిని మనకు ముందుగానే చూపించారు. ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో ఓ వైరస్‌ని తయారు చేసే చైనా భారత్‌లో దాన్ని ప్రయోగిస్తుంది. అచ్చు అలానే కాకపోయినా ఇప్పుడు కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.

ఇక ఆ తరువాత మిడతల దాడి. సూర్య హీరోగా కేవీ ఆనంద్ తెరకెక్కించిన బందోబస్తు చిత్రంలో మిడతల దాడిని చూపించారు. ఇవి రెండు మాత్రమే కాదు సూర్య నటించిన ‘బ్రదర్స్’ సినిమాలో ఒలింపిక్స్‌లో పతకాల కోసం యూరోపియన్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్వేనియా ఆ దేశ ఆటగాళ్లకి ఎనర్జీ డ్రింక్ ఇస్తుంది. నిజ జీవితంలో ఆ ఆరోపణలను ఎదుర్కొన్న రష్యా టీమ్‌పై  ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గతేడాది నిషేధం విధించింది. ఇలా వరుస పరిణామాలతో సూర్య నటించిన ఈ మూడు చిత్రాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ సూర్యకు ఓ రిక్వెస్ట్ పెడుతున్నారు. సార్ మీరు నటించిన 24 సినిమాలోని టైమ్ మిషన్‌ని ఇస్తారా..? సర్ అంటూ పలువురు నెటిజన్లు సూర్యను ప్రశ్నిస్తున్నారు. ఈ టైమ్‌ మిషన్‌ వస్తే ఇప్పుడున్న పరిస్థితులను మార్చొచ్చని వారు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కోలీవుడ్‌ దర్శకులు భవిష్యత్‌ని ముందే ఊహిస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం.. మొత్తం నలుగురికి..!

సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!