
సింపుల్‌గా కనిపించే స్టార్ హీరో ధనుష్.. లగ్జరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడని అభిమానులకు తెలిసిందే. సినిమాల్లో సింపుల్ క్యారెక్టర్లు చేస్తున్నప్పటికీ లగ్జరీ కార్లు, ఇల్లు ఆయన సొంతం. కార్లు, ఇల్లు సంగతి అటుంచితే ధనుష్‌కు వాచీలు అంటే కూడా మహా ఇష్టం. వాచీల కలెక్షన్లలో కూడా ఆయన స్టార్ అనే చెప్పాలి.
సినీ సెలబ్రిటీల కార్లు, వాచ్‌లు, బ్యాగుల కలెక్షన్స్ గురించి తరచూ వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే సింపుల్ లైఫ్‌స్టైల్, హై టేస్ట్ అనిపిస్తుంది కదా? కానీ లగ్జరీ వాచ్‌ల విషయంలో ఆయన వేరే లెవెల్! ధనుష్ వాచ్ కలెక్షన్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇటీవల దుబాయ్ వాచ్ వీక్‌లో పాల్గొన్న ధనుష్, తన ఫేవరెట్ వాచ్‌ను రివీల్ చేసి అందర్నీ షాక్‌లో పడేశాడు. ఆ వాచ్ పేరు ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ క్రోనోగ్రాఫ్. దీని రీసేల్ వాల్యూ ఏకంగా 2.5 కోట్ల రూపాయలు! ఈ స్విస్ బ్రాండ్ వాచ్‌లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, ఆక్టగన్ బెజెల్, రబ్బర్ స్ట్రాప్… లుక్‌తో పాటు టెక్నాలజీ కూడా టాప్ క్లాస్. కానీ ఇది మాత్రమే కాదు! ధనుష్ కలెక్షన్‌లో ఇంకా చాలా వాచ్‌లు ఉన్నాయి. రోలెక్స్ సబ్‌మెరైనర్ (Rolex Submariner), పాటెక్ ఫిలిప్ నాటిలస్ (Patek Philippe Nautilus), రిచర్డ్ మిల్ ఆర్‌ఎం 11-03 (Richard Mille RM 11-03).. ఒక్కోటీ 1.5 నుంచి 2 కోట్లు!
Watches
ఈ రేర్ పీసెస్ అన్నీ కలిపితే ధనుష్ మొత్తం వాచ్ కలెక్షన్ విలువ 60 కోట్ల రూపాయలు! అవును, అక్షరాల అరవై కోట్లు! సింపుల్ లుక్‌లో కనిపించే ధనుష్ గురించి మొదటిసారి బయటపడిన సీక్రెట్. ‘వాచ్ అంటే టైమ్ చూడటం కాదు, అది ఒక ఆర్ట్, ఒక ఇన్వెస్ట్‌మెంట్. ఏళ్లు గడిచే కొద్దీ విలువ రెట్టింపవుతుంది’ అని ధనుష్ చెప్పిన మాట నిజమే. ఈ వాచ్‌లు బ్యాంక్ బ్యాలెన్స్‌లా పెరిగే ఆస్తులు! సింపుల్‌గా కనిపించే ధనుష్ రిస్ట్ మీద ఏ రోజు ఏ వాచ్ ఉంటుందో ఇప్పట్నుంచి ఫ్యాన్స్ గమనిస్తారు. మీరూ ఓ కన్నేసి ఉంచండి!