Corinne Masiero Protests Naked: అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డులకు ఏమాత్రం తీసిపోని వేడుక ఫ్రాన్స్‌లో సీజర్ అవార్డుల పండగ.. అయితే ఈ ఏడాది సభావేదిక రసాభాసగా మారింది. ఈ వేడుకల్ని తన నిరసన చెప్పేందుకు వేదికగా ఉపయోగించుకున్నారు నటి కొరెన్ మాసిరో. మాసిరో అవార్డుల వేదికపైకి గాడిదను తలపించేలాంటి కాస్ట్యూమ్ కప్పుకొని ముందుగా వేదికపైకి వచ్చారు. దాని లోపల ఆమె రక్తంతో తడిచినట్లు ఉన్న ఒక డ్రెస్ వేసుకుని కనిపించారు.
సీజర్ అవార్డుల కార్యక్రమ నిర్వాహకులు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్ ఇవ్వడానికి మాసిరోను వేదికపైకి పిలిచారు. కానీ, వేదికపైకి రాగానే, తన డ్రెస్ విప్పేసిన మాసిరో కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరినీ షాక్ ఇచ్చారు. నటి కొరెన్ మాసిరో వేసుకున్న రెండు డ్రస్సుల్ని విప్పేసి నగ్నంగా వేదికపై నిరసన వ్యక్తం చేశారు. వీపు మీద చాతీ మీద సందేశాలు రాసుకుని వచ్చిన మాసిరో వాటిని అవార్డుల ఫంక్షన్‌లో ప్రదర్శించారు.
ప్రభుత్వానికి తన నిరసన గళం వినిపించడానికి మాసిరో అవార్డుల వేడుకను వేదికగా మార్చుకున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో కళను, సంస్కృతిని కాపాడడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె వీపు మీద సందేశం రాసుకొచ్చారు. ఫ్రాన్స్‌లో సినిమా హాళ్లు మూతపడి మూడు నెలలు దాటింది. ప్రభుత్వం వాటిని తెరవాలనే నిర్ణయం తీసుకోకపోవడంతో చాలామంది కళాకారులు అసంతృప్తితో ఉన్నారు.
తన శరీరంను ప్రచార అస్త్రంగా మలుచుకుంది. పొత్తి కడుపు మీద “సంస్కృతి లేకుంటే.. భవిష్యత్తు లేదు” అని రాసుకున్నారు. మరో వైపు వీపు మీద “మాకు మా కళను తిరిగివ్వండి” అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి నినాదాలతో ప్రధాని ఫ్రాన్స్ ప్రధానమంత్రి జాన్ కాస్టెక్స్‌కు సందేశం ఇచ్చారు.
మాసిరో నగ్నంగా మారడానికి ముందు, మరికొంతమంది కళాకారులు కూడా ప్రభుత్వానికి ఇలాంటి అప్పీలు చేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వం మాల్స్, పబ్బులు, రెస్టారెంట్లకు కూడా అనుమతి ఇచ్చిందని.. సినిమా హాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఇతర నటీ నటులు ప్రశ్నించారు.
థియేటర్లను తెరవాలంటూ గతేడాది డిసెంబర్‌లో కళాకారులు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినీ విమర్శకులు సినీరంగానికి సంబంధించిన కళాకారులు పారిస్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. మిగతా ప్రాంతాలపై ఎత్తివేసినట్లే, సినిమా హాళ్లు, కళా వేదికలపై కూడా నిషేధం ఎత్తివేయాలని, వాటిని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.
సీజర్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్ గెలుచుకున్న సినిమా కంటే మాసిరో నిరసన ఫ్రాన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మాసిరో గతంలో ఉత్తమ నటిగా సీజర్ అవార్డును గెలుచుకున్నారు. ఆమె నటించిన కెప్టెన్ మార్లో అనే డిటెక్టివ్ సిరీస్ బాగా పాపులర్ అయ్యింది. మాసినో చర్యను వేడుకకు హాజరైన చాలా మంది స్వాగతించినా.. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అవార్డుల వేదికను అవమానించారని… ప్రభుత్వానికి నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Yadadri: వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి.. మరికాసేపట్లో విశ్వక్సేనుడి పూజ..
India vs England: అరంగేట్ర మ్యాచ్‌లోనే దంచికొట్టేశాడు.. కెప్టెన్ అండతో దుమ్ములేపాడు.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పవర్ చూపించాడు